Advertisement

  • ఆరోగ్య శ్రీ పరిధిలో లేని జబ్బులకు మాత్రమే ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్...

ఆరోగ్య శ్రీ పరిధిలో లేని జబ్బులకు మాత్రమే ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్...

By: chandrasekar Sat, 21 Nov 2020 12:59 PM

ఆరోగ్య శ్రీ పరిధిలో లేని జబ్బులకు మాత్రమే ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్...


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే రూ. 1,000 దాటిన ప్రతి జబ్బుకు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయ నిధికి సంబంధించిన అర్జీలను బాధితుల నుంచి తీసుకోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్స చేస్తున్నట్లు సీఎంవో పేర్కొంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇలాంటి క్లెయిమ్స్‌ సీఎంఆర్‌ఎఫ్‌ కింద స్వీకరించబోమని స్పష్టం చేసింది.

దీంతో ఆరోగ్య శ్రీ కింద వైద్యం లభించే జబ్బులకు ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బు రాదు. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని జబ్బులకు మాత్రమే ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ అందనుంది.

Tags :
|

Advertisement