Advertisement

బుధవారం నాడు ఉలిక్కిపడిన ప్యారిస్ నగరం...!

By: chandrasekar Thu, 01 Oct 2020 12:36 PM

బుధవారం నాడు ఉలిక్కిపడిన ప్యారిస్ నగరం...!


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో భారీ పేలుడు లాంటి శబ్దం వల్ల ప్రజలు వణికిపోయారు. శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఇంటి గోడలు కూడా కదిలిపాయాయి. బీరుట్ లాంటి పేలుడు సంభవించిందేమో అని అంతా భయపడ్డారు. అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి పేలుడు జరగలేదు అని తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

శబ్దానికి కారణం

ప్యారిస్ లో భారీ శబ్దం వినిపించడంతో ఏం జరిగిందో పోలీసులు చెబితే కానీ ఎవరీకీ తెలియలేదు. పైగా పోలీసులకు ఫోన్ చేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే తరువాత తెలిసిన విషయం ఏంటంటే ఇది బ్లాస్ట్ కాదు అని అది సోనిక్ బూమ్ అని తెలిసింది. జెట్ ప్లేన్ సౌండ్ బ్యారియర్ బ్రేక్ చేయడంతో ఇలా సౌండ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఏదైనా జెట్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంటే చిన్నపాటి విస్పోటం జరుగుతుంది. అందులో వచ్చే సౌండే సోనిక్ బూమ్.

ప్యారిస్ ఆకాశం నుంచి వెళ్తున్న ఒక ఫైటర్ జెట్ భారీ విస్పోటనం వాంటి శబ్దం చేసి వెళ్లింది. దీని తీవ్రత ఎంతగా ఉందంటే నలుదిక్కుల్లో దాని ప్రతిధ్వని వినిపించింది. అయితే దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని పోలీసులు పేర్కొన్నారు. ఈ శబ్దం వినిపించే సమయంలో వింబుల్డన్ పోటీలు కూడా జరుగుతున్నాయి. సౌండ్ వినడంతో ఒక్కసారిగా ఆటగాళ్లు కూడా భయపడ్డారు.

Tags :
|

Advertisement