Advertisement

  • క్రొత్త పథకాల అభ్య‌ర్థ‌న‌లకు నో అన్న కేంద్ర ఆర్థిక‌శాఖ‌

క్రొత్త పథకాల అభ్య‌ర్థ‌న‌లకు నో అన్న కేంద్ర ఆర్థిక‌శాఖ‌

By: chandrasekar Fri, 05 June 2020 7:27 PM

క్రొత్త పథకాల అభ్య‌ర్థ‌న‌లకు నో అన్న కేంద్ర ఆర్థిక‌శాఖ‌


క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ఈ ఏడాదిలో ఎటువంటి కొత్త ప్ర‌భుత్వ పథకాల‌ను అమ‌లు చేయ‌డంలేద‌ని కేంద్ర ఆర్థికశాఖ స్ప‌ష్టం చేసింది. కావున అధిక ఖ‌ర్చును త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త స్కీమ్‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల‌ను కేంద్ర ఆర్థిక‌శాఖ‌కు పంప‌వ‌ద్దు అంటూ అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ మందగించడం నేప‌థ్యంలో మనం కట్టుబడి ఉండాల్సిన సమయం.

ప్ర‌స్తుతం నిధుల కేటాయింపు కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ ప్యాకేజీకి మాత్ర‌మే ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది. కొత్త స్కీమ్‌ల‌కు మాత్రం ఆమోదం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిధుల‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న‌ద‌ని, అయితే అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు నిధుల మంజూరీ ఉంటుంద‌ని ఆర్థిక‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

కేంద్ర బ‌డ్జెట్ కింద ఇప్ప‌టికే కొన్ని స్కీమ్‌ల‌కు కేటాయించిన నిధుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ట్లు ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. కొత్త స్కీమ్‌ల‌కు మాత్రం ఆమోదం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిధుల‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న‌ద‌ని, అయితే అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు నిధుల మంజూరీ ఉంటుంద‌ని ఆర్థిక‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Tags :
|
|

Advertisement