Advertisement

  • భార‌త్ లో వైర‌స్ మ‌ర‌ణాల రేటు త‌గ్గుతున్న‌ట్లు కేంద్రం ప్రకటన

భార‌త్ లో వైర‌స్ మ‌ర‌ణాల రేటు త‌గ్గుతున్న‌ట్లు కేంద్రం ప్రకటన

By: chandrasekar Wed, 22 July 2020 2:18 PM

భార‌త్ లో వైర‌స్ మ‌ర‌ణాల రేటు త‌గ్గుతున్న‌ట్లు కేంద్రం ప్రకటన


ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.49 శాతంగా ఉందని చెప్పింది. 29 రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీస్‌లో ఫాటిలిటీ రేట్‌ (సీఎఫ్‌ఆర్‌‌) ఇండియా 2.5శాతం కంటే తక్కువగా నమోదవుతుందని తెలిపింది. మే 12న భారత్‌లో కరోనా మరణాల రేటు 3.2 శాతం నుండి జూన్‌1 నాటికి 2. 82 శాతానికి తగ్గిందని, ఇక ఇది జూలై 10న 2. 72 శాతానికి, ప్రస్తుతం 2.49 శాతానికి తగ్గిందని కేంద్రం స్పస్టం చేసింది.

ఇక జూలై 20 నాటికి ప్రపంచ సగటు కేసు మరణాల రేటు 4.2% ఉండ‌గా యూకేలో అత్యధికంగా 15.4%, ఇటలీ 14.4% న‌మోద‌య్యాయి. భార‌త్ లో త‌క్కువ మ‌ర‌ణాల న‌మోదు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇమ్యూనిటీ ప‌వ‌రేన‌ని అన్నారు వెల్‌కమ్ ట్రస్ట్ / డీబీటీ ఇండియా అలయన్స్ సీఈఓ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ .మ‌న‌దేశంలో 45సంవత్స‌రాల‌కంటే త‌క్క‌వ వ‌య‌స్సున్న వారు 75 శాతం మంది ఉన్నార‌ని, అంటువ్యాధులు సోకినా త‌ట్టుకునేలా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఎక్కువ‌గా ఉంద‌ని ది హిందూకి తెలిపారు. ఇలా మ‌న‌దేశంతో పాటు దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికన్ కంట్రీస్ కు చెందిన కొన్ని దేశాల్లో ఈ త‌ర‌హా మ‌ర‌ణాలు రేటు ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

భార‌త్ లో జ‌నాభా


2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం భార‌త్ లో స‌గ‌టు వ‌య‌స్సు 26.8శాతం ఉండ‌గా 8.6శాతం మంది 60ఏళ్లు దాటిన వారు ఉన్నార‌ని అన్నారు. అలాగే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న వారిలో బీపీ, డయాబెటిస్, గుండెకు సంబంధించిన కార‌ణాల వ‌ల్ల క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య‌లో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా వైరాల‌జిస్ట్ జ‌మీల్ మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ఇంకా అడ్డుకోగ‌లిగితే మిగిలిన అనారోగ్యాల భారిన ప‌డ‌కుండా ఉండొచ్చ‌ని చెప్పారు.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో మ‌ర‌ణాల రేటు త‌క్కువ


క‌రోనా మ‌ర‌ణాల రేటు త‌గ్గుద‌ల విష‌యంలో ప్ర‌జ‌లు కీరోల్ ప్లే చేస్తున్నార‌ని అన్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆరోగ్యం పై శ్ర‌ద్ధ వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తిన వెంట‌నే ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. దీనికి తోడు నాణ్య‌మైన వైద్యం అంద‌డంతో క‌రోనా మ‌ర‌ణాలు రేటు త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ముఖ్యంగా వైద్యం విష‌యంలో కేర‌ళ ముంద‌జ‌లో ఉంద‌న్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్రారంభం నుంచి కేర‌ళ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

కేర‌ళ ప్ర‌భుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్

ఆరోగ్యం విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాల్లో కేర‌ళ రాష్ట్రం భిన్నంగా ఉంద‌ని వైరాల‌జిస్ట్ జ‌మీల్ తెలిపారు. 2018 నిపా వైర‌స్ వ్యాప్తి నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందింద‌న్నారు. క‌రోనా వైర‌స్ పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన కేర‌ళ ప్ర‌భుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్ చేసింద‌న్నారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఇవేవీ చేయలేద‌ని చెప్పారు. ముఖ్యంగా తమిళనాడులో దాని ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌న్న జ‌మీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక లో కేసులు ఎక్కువ గా న‌మోద‌వుతున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

క‌రోనా ట్రీట్మెంట్ బాగుంది

క‌రోనా మ‌ర‌ణాల రేటు త‌గ్గ‌డంలో వెంట‌నే ట్రీట్మెంట్ అదించ‌డం, మెరుగైన వైద్యం వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌లుగా ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరుల‌లో పెద్ద సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ వ్యాదిగ్ర‌స్తుల కోసం ఏర్పాటు చేస్తున్న చ‌ర్య‌లేన‌న్నారు. ముంబై, ఢిల్లీల‌లో ట్రీట్మెంట్ చేసే ఆస్ప‌త్రుల సంఖ్య‌ను పెంచుతున్నారు. బెంగ‌ళూరులో ఆ ప్ర‌యత్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.


గుజ‌రాత్, ఢిల్లీలో మ‌ర‌ణాల‌ రేటుపై అంచ‌నా కష్టం

గుజ‌రాత్, ఢిల్లీలో న‌మోదైన మ‌ర‌ణాల‌పై రేటుపై వైరాల‌జిస్ట్ జ‌మీల్ అనుమానం వ్య‌క్తం చేశారు. న‌మోదైన క‌రోనా కేసుల్ని అంచ‌నా వేయ‌డంలో అధికారులు విఫ‌ల‌మైన‌ట్లు చెప్పిన ఆయ‌న‌ ఆస్ప‌త్రుల‌లో కేసుల్ని గుర్తించొచ్చు బ‌య‌ట ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యాన‌ని అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మేన‌ని స‌మ‌ర్ధించారు.


Tags :

Advertisement