Advertisement

  • సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యాట కోసం తెరవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం

సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యాట కోసం తెరవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం

By: chandrasekar Mon, 27 July 2020 7:34 PM

సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యాట కోసం తెరవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం


సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యాట కోసం తెరవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసికోనుంది. లాక్‌డౌన్ కారణంగా లడఖ్‌లోని సియాచిన్ బేస్ క్యాంప్, కుమార్ పోస్ట్‌ల సందర్శనకు అనుమతి నిలిపివేసిన కేంద్రం ప్రభుత్వం తాజాగా పునఃప్రారంభానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచంలోని అతిపెద్ద ధ్రువ రహిత హిమానీనదం, ఎత్తైన ఈ యుద్ధ క్షేత్రాన్ని పర్యాటకుల సందర్శననకు అనుమతించాలని గత ఏడాది అక్టోబర్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లడఖ్‌లో శీతాకాలం మొదలు కావడంతో టూరిస్ట్ సీజన్ దాదాపు చివరి దశకు చేరింది. అంతేకాదు, భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న ప్రస్తుత తరుణంలో సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యాట కోసం తెరవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో అక్కడ పౌరులపై ఆంక్షలను తొలగించే ఉద్దేశం ఉన్నట్టు అర్ధమవుతోంది. జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గాల్వన్ లోయ‌కు పశ్చిమాన సియాచిన్ బేస్ క్యాంప్ ఉంది. చైనా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మధ్య ఉండే ఓ చిన్న ప్రదేశం సియాచిన్ గ్లేసియర్. రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతం కావడంతో ఇక్కడికి సాధారణ ప్రజలకు అనుమతి లేదు.

ఇప్పటిరకు సైన్యానికి కావాల్సిన సామాగ్రిని చేరవేయడానికి ఎంపిక చేసిన కొందరు కూలీలు, కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే అవకాశం ఉండేది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాధారణ పౌరులు కూడా సియాచిన్ ను సందర్శించడానికి అవకాశం ఏర్పడింది. వ్యూహాత్మకంగా భారత సైన్యానికి అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ కార్గిల్ యుద్ధ సమయంలో కీల పాత్ర పోషించింది. ఆకాశాన్నంటే హిమ శిఖరాల మధ్య ఉండే ఈ ప్రాంతం ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. తరచూ ఇక్కడ మంచు తుఫాన్లు సంభవిస్తుంటాయి.

గంటకోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మట్టి పెళ్లల మాదిరిగా మంచు చరియలు విరిగి పడుతుంటాయి. దీన్నే అవలాంచ్ అంటుంటారు. స్థానికుల డిమాండ్‌ మేరకు మరిన్ని ప్రాంతాలను తెరవడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. 2018 డిసెంబర్‌లో సరిహద్దు ప్రాంతాల ద్వారా ఐదు కొత్త మార్గాలు తెరిచారు. వీటిలో ఎక్కువ భాగం ఎల్ఏసీ వెంట నడుస్తాయి.

సింధులోని కోయుల్, దేమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు లేవు. సియాచిన్ బేస్ క్యాంప్ లేహ్‌కి 225 కిలోమీటర్లు ఉత్తరాన ఉంది. సియాచిన్ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మాత్రం లేహ్ జిల్లా యంత్రాంగం నిబంధనలు తప్పసరిగా పాటించాల్సి ఉంటుందని ఆర్మీ అడ్వెంచర్ సెల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం లేహ్‌లో 40 కిలోమీటర్ల పరిధిలో స్థానికేతరుల కదలికలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Tags :
|

Advertisement