Advertisement

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో కాశ్మీర్ నుండి 10 వేల పారామిలటరీ బలగాలు వెనక్కి

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో కాశ్మీర్ నుండి 10 వేల పారామిలటరీ బలగాలు వెనక్కి

By: chandrasekar Thu, 20 Aug 2020 09:13 AM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో కాశ్మీర్ నుండి 10 వేల  పారామిలటరీ బలగాలు వెనక్కి


కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో కాశ్మీర్ నుండి 10 వేల పారామిలటరీ బలగాలు వెనక్కి రప్పించింది. బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు 5న కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య అనంతరం అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు చెలరేగకుండా కేంద్రం భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించింది. అక్కడ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ నుంచి 10,000 మంది పారామిలటరీ బలగాలను వెనక్కి రప్పించడానికి నిర్ణయం తీసుకుంది.

బలగాలు వెనక్కి రప్పించడానికి బుధవారం, ఆగస్టు 19 న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కశ్మీర్‌లో కేంద్ర సాయుధ బలగాల మోహరింపు అంశంపై హోం శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 100 కంపెనీల బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. వారందరినీ ఇంతకుముందు పనిచేసిన స్థానాల్లోకి తిరిగి పంపించనున్నారు. మొత్తం 100 కంపెనీల పారామిలటరీ బలగాల్లో 40 కంపెనీలు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉండగా సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలు 20 కంపెనీల చొప్పున ఉన్నాయి.

ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో ఏడాది కాలంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరం చేసి కీలక విజయాలు సాధించింది. దీంతో లోయలో ఉద్రిక్తలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్‌‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు చర్యలు చేపట్టింది. కశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న పలువురు నేతలను కూడా విడిచిపెట్టారు. ఇందువల్ల బీజేపీ నేత మనోజ్‌ సిన్హాను కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. జమ్మూకశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి గిరీష్ చంద్ర ముర్ముకు కాగ్ పదవి కట్టబెట్టారు. తాజాగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. దీనిద్వారా కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పనున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి.

Tags :
|

Advertisement