Advertisement

  • అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన

అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన

By: chandrasekar Mon, 24 Aug 2020 10:05 AM

అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన


అంతర్రాష్ట్ర సరుకు రవాణా, ప్రయాణాలపై కొన్నిరాష్ట్రాల ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై మరోసారి స్పష్టతనిచ్చింది. శనివారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సర్క్యులర్‌ జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కూడా సర్క్యులర్‌ అందింది.

కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రయాణాలు, సరుకుల రవాణాపై అంక్షలు విధించి ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం ఈ సర్యులర్‌లో తెలియపరచబడినది. వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని ఆదేశించింది. మరోవైపు సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్లకు‌ కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌ సమయంలో పాటించాల్సిన నిర్దిష్ట విధివిధానాలను ప్రకటించింది.

అన్‌లాక్‌ 3.0 గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో కేంద్ర ప్రసారంశాఖ ఈ మార్గదర్శకాలు విడుదలచేసింది. షూటింగ్‌ సమయంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కెమెరా ముందు యాక్టింగ్‌ చేస్తున్నవారు తప్ప మిగతా సిబ్బంది అంతా తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్స్‌లోకి అనుమతించకూడదని తెలిపింది.

షూటింగ్‌లో పాల్గొనేవారు ఆరోగ్యసేతు యాప్‌ వాడాలని, హెయిర్‌ స్టైలిస్టులు, మేకప్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది. సాధ్యమైనంత తక్కువ మంది షూటింగ్‌లో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉమ్మడి వస్తువులను వాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. హోటళ్లు, తదితర ప్రదేశాల్లో శానిటైజ్‌ చేసిన తర్వాత షూటింగ్‌ నిర్వహించాలని స్పష్టం చేసింది.

షూటింగులకు ఇతర మార్గదర్శకాలు


* వృద్ధులు, పిల్లలు, వ్యాధులు ఉన్నవారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
* స్టూడియోల్లో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి.
* ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి.
* ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్‌ స్కానర్లను ఏర్పాటు చేయాలి.
* సెట్లు, మేకప్‌ గదులు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్‌ చేయాలి.
* షూటింగ్‌ వస్త్రాలు, విగ్గులు, మేకప్‌ సామాన్లను ఇతరులతో పంచుకోవద్దు.
* కెమెరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగిస్తే కచ్చితంగా సిబ్బంది గ్లౌజులు ధరించాలి.

Tags :

Advertisement