Advertisement

  • హజ్ యాత్రికులకు దరఖాస్తు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం

హజ్ యాత్రికులకు దరఖాస్తు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం

By: chandrasekar Fri, 11 Dec 2020 5:37 PM

హజ్ యాత్రికులకు దరఖాస్తు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం


ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర కు 2021 వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర దరఖాస్తు గడువును యాత్రికుల కోసం జనవరి 10వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గురువారం ప్రకటించారు. దీనిపై ముంబైలోని అయన హజ్ హౌస్‌లో కమిటీ సభ్యులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. హజ్ యాత్రకు చాలా మంది వెళుతుంటారు. కానీ ఈ సారి కరోనా వల్ల మార్పులు చేయబడ్డాయి.

వచ్చే సంవత్సరం 2021 హజ్ యాత్రకు సంబంధించిన గడువు ఈ నెల డిసెంబర్ 10 తో ముగిసిన నేపధ్యంలో మరోసారి ఇప్పుడు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోవిడ్ నేపధ్యంలో వచ్చే ఏడాది జూన్‌-జూలై నెలల్లో జరిగే హజ్‌ యాత్రకు భారత్‌, సౌదీ అరేబియా ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకోసం వారు నియమాలను పాటించాల్సి ఉంటుంది. 2021 హజ్ యాత్రకు ఇప్పటివరకు 40వేలకు పైగా దరఖాస్తులు అందాయని, యాత్రికులు ఎంచుకునే ప్రయాణం ప్రకారం ఖర్చులో తేడా ఉంటుందని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలియజేసారు.

హజ్ యాత్ర కు ప్రస్తుతం అందిన దరఖాస్తుల్లో పురుషులు తోడు లేకుండా వెళ్లే మహిళల ( మెహ్రం ) నుంచి 500 దరఖాస్తులు అందినట్లు ఆయన వెల్లడించారు. మెహ్రం మహిళలను లాటరీ నుంచి మినహాయిస్తామని ఆయన తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా, హజ్ మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణానికి ముందు కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

Tags :

Advertisement