Advertisement

  • అధిక మొత్తంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కేటాయించిన కేంద్ర ఆరోగ్య శాఖ

అధిక మొత్తంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కేటాయించిన కేంద్ర ఆరోగ్య శాఖ

By: chandrasekar Thu, 30 July 2020 4:13 PM

అధిక మొత్తంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కేటాయించిన కేంద్ర ఆరోగ్య శాఖ


కరోనా వ్యాప్తి అధికంగా వున్న కారణంగా అవసరమైన మందుల పంపిణి క్రింద కేంద్ర ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను అధిక మొత్తంలో అన్ని రాష్ట్రాలకు పంపిణి చేసింది. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) మాత్రలను మొదటిసారి పెద్ద మొత్తంలో కేటాయించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 4.24 కోట్ల ట్యాబ్లెట్లను పంపిణీ చేస్తున్నది. హెచ్‌సీక్యూ అనేది యాంటీ మలేరియా డ్రగ్‌. ప్రస్తుతం దీన్ని కొవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. దీన్ని రోగనిరోధకత పెంచే మాత్రగా జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు చేసింది.

బాధితులకు వినియోగించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి వినియోగం కోసం గత శనివారం కేంద్ర సర్కారు 4.24 కోట్ల హెచ్‌సీక్యూ మాత్రలను పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కేటాయింపు. కొవిడ్‌-19 రోగులకు చికిత్సలో భాగంగా రాష్ట్రాలు ఈ ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదివరకు రాష్ట్రాల అవసరాల మేరకే మాత్రలను కేటాయించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం వద్ద బారీ స్టాక్‌ ఉందని, అందుకే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసినట్లు చెప్పారు. ప్రజలు కరోనా వ్యాప్తి అరికట్టడానికి తగు జాగ్రత్తలు తీసికోవాలని ప్రభుత్వం సూచించింది.

Tags :
|

Advertisement