Advertisement

  • కేంద్రం స్పష్టం: తబ్లీఘీ జమాత్‌పై సీబీఐ విచారణ అవసరం లేదు

కేంద్రం స్పష్టం: తబ్లీఘీ జమాత్‌పై సీబీఐ విచారణ అవసరం లేదు

By: chandrasekar Sat, 06 June 2020 11:31 AM

కేంద్రం స్పష్టం: తబ్లీఘీ జమాత్‌పై సీబీఐ విచారణ అవసరం లేదు


భారత్‌లో మొదట కరోనా కేసులు పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాతే కారణమని పెద్ద మొత్తంలో దుమారం రేపుతోంది. చాలా రాష్ట్రాల్లో నమోదైన కేసులకు మర్కజ్ ప్రార్థనలతో లింక్ ఉండడంతో తబ్లీఘీ జమాత్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వం.

తబ్లీఘీ జమాత్ కార్యక్రమం జరగడానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే అలస్వమమని సుప్రియా పండిట్ అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రియా పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను అందజేసింది. ఢిల్లీ పోలీసులు బాగా పనిచేస్తున్నారని, నిర్ణీత సమయానికల్లా వారు దర్యాప్తు పూర్తిచేసి అన్ని వివరాలను తెలియజేస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో తబ్లీఘీ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Tags :

Advertisement