Advertisement

  • కేంద్ర మంత్రి చొరవతో తెలంగాణకు రూ.222 కోట్లు విడుదల చేసిన కేంద్ర౦...

కేంద్ర మంత్రి చొరవతో తెలంగాణకు రూ.222 కోట్లు విడుదల చేసిన కేంద్ర౦...

By: chandrasekar Sat, 07 Nov 2020 6:37 PM

కేంద్ర మంత్రి చొరవతో తెలంగాణకు రూ.222 కోట్లు విడుదల చేసిన కేంద్ర౦...


తెలంగాణ ప్రభుత్వానికి వరద బాధితులకు సహాయం, పునరావాసం కల్పించడంలో ఆర్థిక మద్దతు లభించింది. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం రూ.222.25 కోట్లను విడుదల చేసింది. దీంతో వరద ప్రభావిత హైదరాబాద్ ప్రజలకు, ఇతర జిల్లాల రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఏర్పడింది. ఈ నిధులను రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి నిర్ణీత కాలం కన్నా ముందుగానే తెలంగాణకు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం వారం క్రితం నిర్ణయించింది. వాస్తవానికి ఈ నిధులు 2021 ఫిబ్రవరి-మార్చి నెలల్లో విడుదల కావలసి ఉంది. అయితే కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించి, ఈ నిధులు ముందుగానే విడుదలయ్యేలా కృషి చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బాధితులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

సంబంధిత అధికారులతో కిషన్ రెడ్డి పలు పర్యాయాలు చర్చలు జరిపారని, ప్రధాన మంత్రి కార్యాలయానికి సవివరమైన నివేదికను సమర్పించారని, తక్షణమే నిధులను విడుదల చేయవలసిన పరిస్థితిని వివరించారని తెలిపాయి. జనాభా ప్రాతిపదికపై అర్బన్ లోకల్ బాడీ గ్రాంట్స్ (2020-21) మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 222.25 కోట్లను విడుదల చేసినట్లు కిషన్ రెడ్డి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో తెలంగాణలోని పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాలకు రూ.105.25 కోట్లు, హైదర్‌బాద్‌కు రూ.117 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నీటి నిర్వహణ, సమర్థవంతమైన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం మొదటి విడతగా మొత్తం గ్రాంట్ రూ. 7,419.75 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement