Advertisement

  • అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగి౦చిన కేంద్ర౦...

అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగి౦చిన కేంద్ర౦...

By: chandrasekar Tue, 27 Oct 2020 5:58 PM

అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగి౦చిన కేంద్ర౦...


కేంద్రప్రభుత్వం అన్‌లాక్ 5 నిబంధ‌న‌ల‌ను పొడిగి౦చి౦ది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాలే న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాల‌ను ష‌ర‌తుల‌తో ఓపెన్ చేసేందుకు సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్రం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను న‌వంబ‌ర్ చివ‌రినాటి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఇవాళ కేంద్రం హోంశాఖ స్ప‌ష్టం చేసింది. కంటేన్మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

రెండు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌ల విష‌యంలో ఎటువంటి నిబంధ‌న‌లు లేవ‌ని పేర్కొంది. ఆ రాక‌పోక‌ల‌కు ఎటువంటి అనుమ‌తి అవ‌స‌రం లేదు. సినిమా థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఇస్తూ సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే సినిమాహాళ్ల‌ను తెరిచాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు మా‌త్రం థియేట‌ర్ల‌ను తెర‌వ‌లేదు. ప్ర‌స్తుతం అక్టోబ‌ర్ నిబంధ‌న‌ల‌నే పొడిగించ‌డం వ‌ల్ల థియేట‌ర్ల యాజ‌మాన్యం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాల్సిందే.

Tags :
|

Advertisement