Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం

By: chandrasekar Mon, 05 Oct 2020 11:44 AM

కరోనా వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం


అక్టోబరు నెలాఖరు కల్లా కరోనా వ్యాక్సిన్ తొలుత ఏ జనాభాకు ఇవ్వాలో సంబంధిత జాబితాను సమర్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రతి ఆదివారం నిర్వహించే సండే సంవాద్ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో పలువురితో మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు కరోనా వైరస్ తో ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుందో వారికి ప్రాధానత్య ఇస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పారదర్శకంగా, సమానంగా సరఫరా చేసే ఒక వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం 24 గంటలు పని చేస్తున్నదని ఆయన తెలిపారు.

దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని హర్ష వర్ధన్ తెలిపారు. వ్యాక్సిన్‌ను భద్రపరిచే శీతల మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా రాష్ట్రాలను కోరినట్లు పేర్కొన్నారు. 2021 జూలై నాటికి సుమారు 20 కోట్ల ప్రజల కోసం 40 నుంచి 50 కోట్ల డోసుల కరోనా టీకాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో చైనా, రష్యా దేశాలు కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాయని హర్ష వర్ధన్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సూపర్ మార్కెట్ ఉద్యోగులు, సరిహద్దు సిబ్బందికి కరోనా టీకాను చైనా ఇస్తోందని అన్నారు. రష్యాలో రెండు రాష్ట్రాలకు చెందిన మీడియా జర్నలిస్టులకు కూడా స్పుత్నిక్ వి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తున్నదని తెలిపారు.

Tags :

Advertisement