Advertisement

  • ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం.. డీఏ పెంపు అంశానికి సంబంధించి కీలక ప్రకటన...

ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం.. డీఏ పెంపు అంశానికి సంబంధించి కీలక ప్రకటన...

By: chandrasekar Sat, 21 Nov 2020 5:55 PM

ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం.. డీఏ పెంపు అంశానికి సంబంధించి కీలక ప్రకటన...

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ పే స్కేల్ కింద వేతానాలు పొందే సీపీఎస్‌ఈ ఉద్యోగులకు కూడా పెంపు ఉండదని స్పష్టం చేసింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ CPSEs ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వీరికి ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాల ప్రకారం జీతాలు అందుతాయని తెలిపింది. 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఇవే రూల్స్ అమలులో ఉంటాయని పేర్కొంది. ‘కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సీబీసీఈ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లకు ఐడీఏ వేతన సవరణ మార్గదర్శకాలు వర్తిస్తాయి. అందువల్ల అక్టోబర్ నెల నుంచి డీఏ అదనపు చెల్లింపులు ఉండవు’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చెల్లించాల్సిన డీఏ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లు కూడా ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత రేట్ల ప్రకారం 2020 జూలై నుంచి డీఏ చెల్లిస్తామని తెలిపింది. అయితే ఇక్కడ డీఏ మొత్తాన్ని ఎప్పటి నుంచి చెల్లిస్తారనే అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది.

Tags :

Advertisement