Advertisement

  • ఐపీఎల్ ను రద్దు చేస్తే బోర్డుకు 500 మిలియన్ డాలర్లకు పైగా నష్టం

ఐపీఎల్ ను రద్దు చేస్తే బోర్డుకు 500 మిలియన్ డాలర్లకు పైగా నష్టం

By: chandrasekar Tue, 07 July 2020 3:36 PM

ఐపీఎల్ ను రద్దు చేస్తే బోర్డుకు  500 మిలియన్ డాలర్లకు పైగా నష్టం


ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న కారణంగా ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.

అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఈవెంట్ భవిష్యత్తుపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. కానీ సమావేశానికి తేదీ ప్రకటించకపోవడంపై, పైగా (ఐసీసీ) నిర్వాహకులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ నిర్వహణకు న్యూజిలాండ్ ముందుకు వచ్చిందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్ 2020 మార్చి 29 నుండి మే 24 వరకు జరగాల్సి ఉండగా కరోనావైరస్ విజృంభణ కారణంగా నిరవధికంగా నిలిపివేయబడిన సంగతి తెలిసిందే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక క్రికెట్ బోర్డులు ఇప్పటికే T20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తి చూపించాయి. ఇదివరకే IPL భారత్ వెలుపల రెండుసార్లు జరిగింది. దక్షిణాఫ్రికా 2009లో ఆతిథ్యం ఇవ్వగా 2014లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. 2020 ఐపీఎల్ ను రద్దు చేస్తే బోర్డు 500 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుందని ధుమల్ తెలిపారు.

Tags :
|
|

Advertisement