Advertisement

  • బట్టతలను ఫుట్ బాల్ గా గుర్తించి చూపిన కెమెరా.. టెక్నాలజీ పై నవ్వుల సెట్టైర్..

బట్టతలను ఫుట్ బాల్ గా గుర్తించి చూపిన కెమెరా.. టెక్నాలజీ పై నవ్వుల సెట్టైర్..

By: chandrasekar Mon, 02 Nov 2020 09:38 AM

బట్టతలను ఫుట్ బాల్ గా గుర్తించి చూపిన కెమెరా.. టెక్నాలజీ పై నవ్వుల సెట్టైర్..


ప్రస్తుతం చాలా విషయాలు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఫుట్‌బాల్ గేమ్‌లో కెమెరా ఫోకస్ అంతా ఫుట్‌బాల్‌పైనే ఉంటుంది. గ్రౌండ్‌లో అంత మంది ఆటగాళ్లున్నా బాల్‌నే టార్గెట్ చేస్తుంది. ఆ బాల్ ఎటు వెళ్తే కెమెరా అటు తిరుగుతూటీవీ లైవ్‌లో ప్రేక్షకులకు చూపిస్తుంది. ఐతే కొన్నిసార్లు మనుషులే కెమెరాను ఆపరేట్ చేస్తే కొన్ని సార్లు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలు ఆటోమేటిగ్గా బాల్‌పై ఫోకస్ పెడతాయి. ఐతే స్కాట్లాండ్‌లో జరిగిన ఓ పుట్‌బాల్ మ్యాచ్‌లో ఏఐ కెమెరా పప్పులో కాలేసి రచ్చరచ్చ చేసింది. ఫుట్ బాల్ ఏదో మనుషుల తలలు ఏవో సరిగ్గా గుర్తించకుండా లైవ్ మొత్తాన్ని పాడు చేసింది. లైన్‌మ్యాన్ బట్టతలను చూసి ఫుట్‌బాల్‌గా పొరపాటు పడిన ఆ కెమెరా ఫుట్‌బాల్‌కు బదులు అతడి బట్ట తలను బాల్ గా గుర్తించి ఫోకస్ చేసింది. ఇటీవల స్కాట్లాండ్‌లోని కెలడోనియన్ స్టేడియంలో ఇన్వర్నెస్ కెలడోనియన్ థిసిల్, అయిర్ యునైటెడ్ జట్ల మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కెమెరామన్‌కు బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాను ఉపయోగించారు. ప్రోగ్రామ్ ప్రకారం పనిచేసిన ఏఐ కెమెరా గ్రౌండ్లో ఫుట్‌‌బాల్‌పై ఫోకస్ పెట్టకుండా లైన్‌మెన్ బట్టతలను ఫోకస్ చేసింది.

ఈ మ్యాచ్ల్లో బట్టతలను చూసి ఫుట్‌బాల్‌గా పొరబడి అతడి తలను ఫోకస్ చేస్తూ చూపించింది. ఇరు జట్ల సభ్యులు ఫుట్‌బాల్ కోసం పోటీపడుతుంటే అది చూపించకుండా లైన్ మెన్‌ను చూపించడంతో ఆడియెన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. గేమ్ అంత రసవత్తరంగా సాగుతుంటే బాల్‌ను చూపించకుండా లైన్‌మెన్ చూపిస్తున్నారేంటని చిరాకు పడ్డారు. చివరకు అసలు మ్యాటర్ తెలిసి అందరూ నువ్వుకున్నారు. ఏఐ కెమెరా లైన్‌మెన్ బట్టతలను ఫోకస్ చేసిన వీడియోను కామెడీ రైటర్ జేమ్స్ ఫెల్టన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దానిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు. 2020లో ఇప్పటికే ఎన్నో చూశామని ఇలాంటి వింతలు ఇంకెన్ని చూడాలో అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 2020 ఎప్పటికీ మరచిపోలేని సంవత్సరమంటూ ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు. ఎంతకైనా మనుషులు మనుషులే యంత్రాలు యంత్రాలే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మనుషుల స్థానంలో మెషీన్లు పనిచేస్తే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. పొరబాటువల్ల ప్రేక్షకులు కొంత అసౌకర్యానికి లోనయ్యారు.

Tags :

Advertisement