Advertisement

ప్రభాస్ చేస్తున్న 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:45 PM

ప్రభాస్ చేస్తున్న 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు...


బాహుబలి సినిమాతో ప్రభాస్ వచ్చిన ఇమేజ్ అంత ఇంత కాదు. బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమా హిందీలో కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసి౦ది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. కానీ హిందీలో సూపర్ హిట్ అయింది. సినిమాలు చేస్తున్న నిర్మాతలకు కూడా మరింత నమ్మకం పెరిగింది. ఒక్కో సినిమాకు నిర్మాత‌లు వందల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటి౦ది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బడ్జెట్ దాదాపు 140 కోట్లు. సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉండబోతుంది. కేజియఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది.

పాన్‌ ఇండియన్ స్థాయిలో 150 కోట్లకు తగ్గకుండా ఈ సినిమా రానుంది. ప్రభాస్ మార్కెట్ ఉందని నిరూపించుకునే పనిలోనే ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఆదిపురుష్ పౌరాణిక చిత్రంలో రాముడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుందని అందుకే అంత బడ్జెట్ అయినా ధైర్యం చేస్తున్నామని అన్నారు. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాల బడ్జెట్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి.

Tags :
|

Advertisement