Advertisement

మహారాష్ట్ర కరోనా కేసుల విజృంభణ

By: chandrasekar Tue, 09 June 2020 4:29 PM

మహారాష్ట్ర కరోనా కేసుల విజృంభణ


కరోనా వైరస్‌ మహారాష్ట్రలో మరింతగా విజృంభిస్తున్నది. గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదవుతూ అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వచ్చి మహారాష్ట్ర కేసుల సంఖ్య చైనాలో నమోదైన సంఖ్యను దాటేసింది. ఆదివారం వరకు చైనాలో మొత్తం 84,191 కేసులు నమోదవగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 88,528 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

సోమవారం ఒక్కరోజే 2,553 కేసులు నమోదవడం చూస్తే మహారాష్ట్రలో మహమ్మారి ఎంతగా విజృంభిస్తుందో తెలుస్తుంది. ఈ రోజు నమోదైన కేసుల్లో దాదాపు 1,311 కేసులు కేవలం ముంబై నుంచే నమోదు కావడం మరింత కలవరపెడుతున్నది. మే 15 వరకు మొత్తం ధ్రువీకరించిన కేసులతో చైనానా భారత్‌ అధిగమించింది. ఇప్పుటివరకు కొవిడ్‌-19 కేసులు 2,56,611 పాజిటివ్‌ కేసులు ధ్రువీకరించారు. అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే తర్వాతి స్థానంలో భారత్‌ నిలిచింది. మే 15 నుంచి జూన్‌ 7 మధ్య కాలంలో భారత్‌లో 1,70,000 కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లో ముంబై మరీ అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 57 శాతం 48,774 కేసులు ముంబై నమోదవగా 13,014 కేసులతో థానే రెండో స్థానంలో ఉన్నది. 24 గంటల్లో 109 మంది వ్యాధిగ్రస్థుల మరణాలతో ఇప్పటివరకు మహారాష్ట్రలో చనిపోయిన వారి సంఖ్య 3,169కి చేరింది. ముంబైలో ఈరోజు 64 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,702 కు చేరింది.


Tags :
|
|

Advertisement