Advertisement

  • బిగ్‌బాస్ షో సీజన్ 14లో ఎసిపోడ్‌కు రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్న సల్మాన్

బిగ్‌బాస్ షో సీజన్ 14లో ఎసిపోడ్‌కు రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్న సల్మాన్

By: chandrasekar Tue, 07 July 2020 4:49 PM

బిగ్‌బాస్ షో సీజన్ 14లో  ఎసిపోడ్‌కు రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్న సల్మాన్


హిందీలో బిగ్‌బాస్ షో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ షో మంచి సక్సెస్ సాధించింది. అదే ఊపుతో తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్‌కు రంగం సిద్ధమైంది. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 13 సీజన్లు పూర్తి చేసుకుంది.

బిగ్ బాస్ 14 వ సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేరేషన్స్ మొదలైయ్యాయి. ప్రతి సీజన్‌లో సల్మాన్ ఖాన్ తన రెమ్యుననరేషన్ పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా 14వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్ చేయబోతున్నాడు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ పై నెటిజన్లు ఒకింత ఆగ్రహంగా ఉన్నారు.

ఇప్పటికే ఆయన్ని సోషల్ మీడియాలో కొంత మంది అన్ ఫాలో చేసారు. ఐనా ఇవేవి సల్మాన్ ఖాన్ ఇమేజ్‌ను తగ్గించలేదు. తాజాగా బిగ్‌బాస్ షో సీజన్ 14లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్ రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంటే సల్మాన్ ఖాన్ ప్రతి వారం వీకెండ్ శని, ఆదివారాలు ఎపిసోడ్‌లో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. ఈ లెక్కన 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజలు సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ ఎసిపోడ్‌లో కనిపిస్తాడు. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 14 సీజన్ కోసం సల్మాన్ ఖాన్ రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు పారితోషకం అందుకునే అవకాశాలున్నాయి.

మొత్తంగా ఒక సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తే రూ. 50 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు. అదే బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో ద్వారా అంతకు 9 నుంచి 10 రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మొత్తంగా సల్మాన్ ఖాన్ తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడనే చెప్పాలి.

Tags :
|

Advertisement