Advertisement

  • భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథి ధోనీపై గౌరవాన్నిచాటిన బీసీసీఐ

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథి ధోనీపై గౌరవాన్నిచాటిన బీసీసీఐ

By: chandrasekar Wed, 28 Oct 2020 9:51 PM

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథి ధోనీపై గౌరవాన్నిచాటిన బీసీసీఐ


ఎంఎస్ ధోనీ...భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. తొలిసారి భారత క్రికెట్ జట్టు ధోనీ లేకుండా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ 32 మందితో కూడిన జంబో జట్టును ఎంపిక చేసింది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా.. బీసీసీఐ ఎంఎస్ ధోనీని ప్రశంసించింది. థ్యాంక్యూ ఎంఎస్ ధోనీ అనే హ్యాష్ ట్యాగ్‌, ధోనీ ఫొటోతో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ కవర్ ఫొటోలను మార్చేసింది.

ధోనీ సేవలకు గుర్తుగా బీసీసీఐ ఇలా గౌరవం ఇవ్వడం పట్ల ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బీసీసీఐపై ప్రశంసల ఝల్లులు కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ చాలా కాలంగా క్రికెట్ ఆడకపోవడంతో టచ్‌లోకి రావడానికి మహీ ఇబ్బంది పడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండమే కాకుండా.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

Tags :

Advertisement