Advertisement

  • గగన౦ లో రష్యా, అమెరికా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం...రాజకీయ విశ్లేషకుల భయాందోళనలు

గగన౦ లో రష్యా, అమెరికా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం...రాజకీయ విశ్లేషకుల భయాందోళనలు

By: chandrasekar Mon, 31 Aug 2020 9:25 PM

గగన౦ లో రష్యా, అమెరికా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం...రాజకీయ విశ్లేషకుల భయాందోళనలు


అంతర్జాతీయ గగనతలంలో రష్యా, అమెరికా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రష్యా దళాలు దూకుడు ప్రదర్శిస్తూ ఆమెరికా సైన్యాన్ని రెచ్చగొడుతున్నది. వారం వ్యవధిలో ఈ రెండు దేశాల దళాలు ముఖాముఖిగా తలపడటంతో రానున్న రోజుల్లో ఏం జరుగనున్నదో అని రాజకీయ విశ్లేషకులకు భయాందోళనలు ప్రారంభమైనాయి. ఐరోపాలోని నల్ల సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో అమెరికాకు చెందిన బీ-52 బాంబర్ విమానం ఎగురుతుండగా రష్యాకు చెందిన యుద్ధవిమానం ఒకటి దూకుడు ప్రదర్శించింది. అమెరికా విమానానికి వంద అడుగుల దూరంలోకి వచ్చిన రష్యన్ విమానం పలు మార్లు అమెరికా బాంబర్ ఫ్లైట్ ముక్కు పైనుంచి గాల్లోకి ఎగిరుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

రష్యా విమానం కారణంగా ఐరోపా గగనతలంలో అమెరికా పైలట్ చాలా ఇబ్బందికి గురయ్యాడని అమెరికా వాయుసేన కమాండర్ జెఫ్ హార్రిగెయిన్ చెప్పారు. శుక్రవారం నాటో దేశాలకు సంఘీభావం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ గగనతలంలో అమెరికా బీ-52 బాంగర్ విమానం ఎగురుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. తూర్పు సిరియాలోని డైరిక్ అనే ప్రదేశంలో కూడా బుధవారం నాడు అమెరికా, రష్యా సైనిక వాహనాలు ఒకే వరుసలో ప్రయాణిస్తున్న సమయంలో రష్యాకు చెందిన ఓ విమానం దూకుడుగా వచ్చి అమెరికాకు చెందిన విమానాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా రష్యా హెలికాప్టర్లు కూడా అమెరికా విమానానికి దగ్గరగా వచ్చాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు అమెరికా ఆరోపిస్తున్నది.

Tags :
|

Advertisement