Advertisement

  • ఆస్ట్రాజెనెకా కరోనా వాక్సిన్ ట్రయల్స్ ఆగిన ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి

ఆస్ట్రాజెనెకా కరోనా వాక్సిన్ ట్రయల్స్ ఆగిన ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి

By: chandrasekar Fri, 11 Sept 2020 6:59 PM

ఆస్ట్రాజెనెకా కరోనా వాక్సిన్ ట్రయల్స్ ఆగిన ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి


ప్రపంచమే కరోనా వల్ల బాధపడుతున్న ఈ సమయంలో వాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. యూకే కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ వాక్సిన్ తాయారు చేసి ప్రయోగ దశలో వుంది, వలంటీర్ అస్వస్థత కారణంగా ఆక్స్ఫర్డ్ కొవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపేసినా ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రసిద్ధ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. వీటిలో తగినన్ని మార్పులు చేసి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

ఆగిన ఈ వాక్సిన్ మళ్ళీ ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లో ఉంటుందని యూకేకు చెందిన ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ఓ మీడియా కార్యక్రమంలో వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ టీకా తీసుకున్న ఓ వలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ఈ క్లినికల్ ట్రయల్స్ను తాత్కాలికంగా స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ భద్రతను సమీక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని రూపొందించారు. అయితే, ఇది ట్రయల్స్ సమగ్రతను కాపాడటానికి రూపొందించిన సాధారణ చర్య అని కంపెనీ తెలిపింది.

వాక్సిన్ను మెరుగు పరచి ట్రయల్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభించవచ్చో ఈ కమిటీ తమకు మార్గనిర్దేశం చేస్తుందని సోరియట్ తెలిపారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా, కొవిడ్ వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల సహాయంతో ఆస్టాజెనెకా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ప్రపంచంలో తుది దశ ట్రయల్స్లో ఉన్న తొమ్మిదో టీకాల్లో ఆక్స్ఫర్డ్ టీకా ఒకటి. త్వరగా వాక్సిన్ అందుబాటుకు వస్తేనే కరోనా ని కట్టడి చేయవచ్చు.

Tags :
|

Advertisement