Advertisement

  • ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఆక్టోబర్‌ 5కు వాయిదా

ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఆక్టోబర్‌ 5కు వాయిదా

By: chandrasekar Mon, 21 Sept 2020 5:08 PM

ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఆక్టోబర్‌ 5కు వాయిదా


ఏపీ‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను ఆక్టోబర్‌ 5కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే హైకోర్టు విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే వెంటనే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చెయ్యాలనుకున్న ప్రభుత్వానికి ఈ స్టేటస్ కో ఆదేశం ఇబ్బందికరమే. రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ వంటివారపు వేసిన పిటిషన్‌లపై ఇవాళ్టి నుంచి ఏపీ హైకోర్టు రోజువారీ విచారణ జరపాలనుకుంది. ధర్మాసనం ముందు మొత్తం 93 పిటిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాయిదా పడటంతో అక్టోబర్ 5 నుంచి ఈ 93 పిటిషన్లపై విచారణ జరగనుంది.

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై రాజధాని రైతులు కేసులు వేశారు. సీఆర్డిఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కేసులు నమోదయ్యాయి. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 CRPC విధింపును ఛాలెంజ్ చేశారు రాజధాని ప్రాంత రైతులు. పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టంపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఇలా రాజధానికి సంబంధించిన కేసులు, దాఖలైన పిటిషన్లపై ఆన్‌లైన్ ద్వారా విచారణ కూడా వాయిదా పడింది. మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు. రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. కానీ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.

Tags :

Advertisement