Advertisement

  • పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం

పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం

By: chandrasekar Sat, 01 Aug 2020 5:51 PM

పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం


ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు 2020 జూలై 31తో ముగుస్తుంది. కానీ ఈ గడువును ఆగస్టు 25, 2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఆగస్ట్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంగ్లిష్‌ మీడియం బోధన:

పదవ తరగతి పాసైన విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు

https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకొని కాపీని సంబంధిత ప్రిన్సిపాల్‌కు నిర్ణీత గడువులోగా సమర్పించాలి. అన్ని కోర్సుల్లో సీట్ల కేటాయింపులో 33.33 శాతం బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించబడదు.

కొత్త షెడ్యూల్‌:

పాత షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 1న దరఖాస్తుల్ని పరిశీలించి ఆగస్ట్ 3న సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదే రోజున తరగతుల్ని కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం దరఖాస్తు గడువును పొడిగించడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్, తరగతులను ప్రారంభించే షెడ్యూల్ మొత్తం మారబోతుంది.


Tags :

Advertisement