Advertisement

  • ఆడపిల్లల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆడపిల్లల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

By: chandrasekar Wed, 26 Aug 2020 09:15 AM

ఆడపిల్లల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం


దేశంలో మహిళలకు భద్రత కరువై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి మహిళల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లల రక్షణ కోసం లక్ష్యంగా ఎనిమిది 'స్పెషల్‌ కోర్టుల' ను ప్రభుత్వం మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని తన ఉత్తర్వులో పేర్కొంది. దీనిద్వారా నేరస్థులు తొందరగా శిక్షించబడతారు.

మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని శిక్షించడం కోసం రాష్ట్రంలో వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్న చోట కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ఈ ప్రత్యేక కోర్టులు పనిచేయనున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలన రేపిన తెలంగాణ దిశ హత్యాచార ఘటన విషయం అందరికి తెలిసిందే. ఆ ఘటన జరిగిన తర్వాత ఏపీలో దిశ చట్టం అమల్లోకి తెచ్చింది. అత్యాచార కేసులను వీలైనంత త్వరగా విచారించి నిందితులకు త్వరగా శిక్ష విధించాలన్నదే దీని ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. వాటితో పాటు ఏపీలో ప్రత్యేక దిశా పోలీస్ స్టేషన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ అమలు చేస్తున్న దిశా చట్టంపై పలు రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరిచాయి. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా కఠిన శిక్షలు అమలయ్యే విధంగా చూస్తారు.

Tags :

Advertisement