Advertisement

  • ఉగ్రదాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం

ఉగ్రదాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం

By: chandrasekar Tue, 10 Nov 2020 09:50 AM

ఉగ్రదాడిలో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం


దేశ సరిహద్దుల్లో వాగ్రవాదుల చేతుల్లో అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థికసాయం చేసింది. ఉగ్రదాడిలో అమరుడైన చిత్తూరు జిల్లా జవాన్‌ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య రజితకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డి ప్రాణత్యాగం వెలకట్టలేనిదని కుటంబానికి కొంతైనా ఆసరాగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.50 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇక ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబాన్ని మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబులు రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు మంత్రులు తెలిపారు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. శనివారం రాత్రి జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎల్‌వోసీ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన దుండగులను భారత జవాన్లు అడ్డుకున్నారు.

భారత దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు సైనికులు వీరమరణం పొందారు. అమరులైన సైనికుల్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్‌18 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. హవిల్దారుగా పనిచేస్తూ కమాండో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రవీణ్ మృతిలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్‌తో పాటు తెలంగాణకు చెందిన జవాన్ మహేష్ కూడా ఉగ్రదాడిలో అమరులయ్యారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌(26) కూడా వీరమరణం పొందారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శాంకరి జూనియర్‌ కళాశాలలో మహేష్ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహేష్ దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరారు. రెండేళ్ల క్రితమే ఆయనకు వివాహం జరిగింది. మహేష్ మృతితో నిజామాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ అమర వీరుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ భద్రతలో వీరు వీర మరణం పొందారు.

Tags :
|

Advertisement