Advertisement

  • సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన

సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన

By: chandrasekar Wed, 17 June 2020 12:39 PM

సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన


సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయం, 44,396 కోట్ల మూలధన వ్యయంతో అంచనాతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన మరోసారి చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని అన్నారు.

వ్యవసాయానికి రూ. 11,891 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 3,615 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,100 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 1998.55 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఎస్సీల సంక్షేమానికి రూ. 7, 525, కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 23,406 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ గృహ వసతికి రూ. 3 వేల కోట్లు, పీఎం అవాజ్ యోజన అర్బన్‌కు రూ. 2,540 కోట్లు, పీఎం అవాజ్ యోజన గ్రామీణానికి రూ. 500 కోట్లు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు.

రేషన్ బియ్యానికి రూ. 3 వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ. 975 కోట్లు, అభివృద్ధి పథకాలకు రూ. 84,140 కోట్లు, షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ. 15,735 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే అనేక శాఖలకు కేటాయింపులు అధిగం చేసారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ. 16 వేల కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకు రూ. 6300 కోట్లు, అమ్మ ఒడికి రూ. 6000 కోట్లు, జగనన్న విద్యాదీవెనకు రూ. 3009 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకు రూ. 3000 కోట్లు,

జగనన్న వసతి దీవెనకు రూ. 2 వేల కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 350 కోట్లు, వైఎస్ఆర్ వాహనమిత్రకు రూ. 275 కోట్లు, వైఎస్ఆర్ జగనన్న చేదోడుకు రూ. 247 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకు రూ. 109 కోట్లు, జగనన్న తోడు రూ. 100 కోట్లు, ఇమామ్, మౌజమ్‌లకు రూ. 50 కోట్లు, లా నేస్తంకు రూ. 12.75 కోట్లు, జెరూసలేం యాత్రకు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.

Tags :
|
|
|

Advertisement