Advertisement

  • ఈఎస్ఐ కుంభకోణంలో సంచలన విషయాలు వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ

ఈఎస్ఐ కుంభకోణంలో సంచలన విషయాలు వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ

By: chandrasekar Thu, 20 Aug 2020 1:45 PM

ఈఎస్ఐ కుంభకోణంలో సంచలన విషయాలు వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...ఈఎస్‌ఐ కుంభకోణంలో వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశామని జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 230 కోట్ల బడ్జెట్‌కు ఆదేశాలు జారీ చేస్తే రూ. 650 కోట్ల కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశామన్నారు. ఇంకా మరికొందరిని విచారించాల్సి ఉందని తెలిపారు. మందులు, పరికరాలు సప్లై చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. మిగిలిన వారి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గాలిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. కాల్‌ సెంటర్‌లో చూపించిన కాల్స్‌ అన్నీ నకిలీవేనని గుర్తించినట్లు చెప్పారు.

తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని రవికుమార్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని, నిందితుల సంఖ్య కూడా 25కు పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ‘‘టీడీపీ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో అవినీతిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మందుల కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టుగా గుర్తించాం. రూ. 106 కోట్ల విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టులో కొన్నారు. లక్ష పైనే కొనే వాటిని ఈ ప్రోక్యూర్‌లోనే కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్ల పక్కన పెట్టి రూ. 400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు.

ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అవకతవల కోసం అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేశారు. వాటిని 2019 తర్వాత మూసేశారని గుర్తించాం. డాక్టర్ జనార్దన్ రూ. 4 కోట్ల విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీదు. స్టాక్ బోర్డు లెక్కలు సరిపోలేదు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారు.’’ అని రవికుమార్ వివరించారు. ‘‘టెలీ సర్వీసెస్‌కు వచ్చిన కాల్స్ అన్నీ ఫెక్. అవన్నీ తెలంగాణ ఫోన్లుగా గుర్తించాం. రూ. 480 ఈసీజీకి వసూలు చేశారు. నిబంధనల ప్రకారం రూ. 200 మాత్రమే చేయాలి. టెలీ సర్వీస్‌లో రూ. 400 కోట్లు అక్రమాలు జరిగాయి. బడ్జెట్ కూడా పక్క దారి పట్టింది. రూ. 132 కోట్లు బడ్జెట్ లేకపోయినా ఆర్డర్లు చేశారు. ప్రభుత్వం రూ. 230 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తే రూ. 650 కోట్ల పర్చేజ్ ఆర్డర్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు గుర్తించాం. అచ్చెన్నాయుడికి బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది’ అని రవికూమార్‌ తెలిపారు.

Tags :

Advertisement