Advertisement

  • రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి 14 రోజుల రిమాండ్..

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి 14 రోజుల రిమాండ్..

By: Sankar Thu, 05 Nov 2020 12:33 PM

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి 14 రోజుల రిమాండ్..


రిపబ్లిక్‌ టెలివిజన్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామిని నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఇంటీరియల్‌ డిజైనర్‌ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

తన నివాసంపై పోలీసులు దాడి చేయడంతో పాటు తమ మీద తన అత్త, మామ, తన కొడుకు మీద కూడా దాడి చేశారని అర్నాబ్‌ ఆరోపణలు చేశాడు. ఇక అర్నాబ్‌ అరెస్ట్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి సీరియస్‌ అయ్యారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని, మళ్లీ ఎమర్జన్సీ రోజులు వచ్చాయని అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. సోనియా, రాహుల్‌ గాంధీ డైరెక్షన్‌లోనే మహారాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.

అయితే.. ఈకేసులో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ అలీబాగ్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు. అర్నాబ్‌ గోస్వామిని పోలీస్‌ కస్టడీకి పంపించాలని కోరగా..జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Tags :

Advertisement