Advertisement

  • ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల ప్రవేశ ప్రక్రియ మళ్లీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల ప్రవేశ ప్రక్రియ మళ్లీ ప్రారంభం

By: chandrasekar Tue, 07 July 2020 3:28 PM

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల ప్రవేశ ప్రక్రియ మళ్లీ ప్రారంభం


ఏపీ లో ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మరెందుకు ఆలస్యం నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసేయండి. మోడల్ స్కూళ్ల ప్రవేశ ప్రక్రియ మళ్లీ ప్రారంభం అవుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల ప్రవేశ ప్రక్రియ మళ్లీ ప్రారంభం అవుతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 అంటే ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఏపీలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సీటు కోసం ఎంట్రన్స్ పరీక్షలేవీ ఉండవు. కేవలం లాటరీ ద్వారా మాత్రమే విద్యార్దుల్ని ఎంపిక చేస్తారు. 6వ తరగతిలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ స్కూల్స్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో లాగిన్ అవడం ద్వారా చేయవచ్చు. జూలై 25 వతేదీ దీనికి ఆఖరు తేదీ. మరో ముఖ్య విషయమేమంటే మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లకు ఏ విధమైన ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓసీ, బీసీ అభ్యర్దులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 50 రూపాయలుగా నిర్ణయించారు.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ: జూలై 6 2020 , దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 25, 2020 , విద్యార్హత: 2019-20లో 5వ తరగతి, వయస్సు: ఓసీ, బీసీ విద్యార్దులైతే సెప్టెంబర్ 1, 2008 నుంచి ఆగస్టు 31, 2010 మధ్యన జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ విద్యార్దులైతే సెప్టెంబర్ 1 2006 నుంచి ఆగస్టు 31 2010 మద్యలో జన్మించి ఉండాలి.

Tags :

Advertisement