Advertisement

  • ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి

By: chandrasekar Thu, 03 Sept 2020 5:13 PM

ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి


రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అధికారుల మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై కూడా దాడులు జరిగాయి. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యమైంది. విశాఖ జిల్లా కసింకోట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుపుతున్నారు.

గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎమ్మార్వో కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. బలిజపేట ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గార ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. తన ప్రమాణస్వీకారం రోజునే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అవినీతి నిరోధం కోసం ఓ కాల్ సెంటర్ తీసుకొచ్చారు. 14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలో అవినీతి మీద ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఆ విధంగా గత కొన్ని రోజుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Tags :
|

Advertisement