Advertisement

  • 14 మంది వలసదారులు క్వారంటైన్ కేంద్రం నుంచి పరార్

14 మంది వలసదారులు క్వారంటైన్ కేంద్రం నుంచి పరార్

By: chandrasekar Thu, 09 July 2020 1:29 PM

14 మంది వలసదారులు  క్వారంటైన్ కేంద్రం నుంచి పరార్


బల్రాంపూర్ జిల్లాలోని డిండో వద్ద ఉన్న 14 మంది వలసదారులు క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి పరారైన వారిలో నుంచి ఐదుగురుని తిరిగి క్వారంటైన్ కేంద్రానికి తీసుకువచ్చారు. మిగిలిన వారి కోసం పోలీసులు, వైద్య సిబ్బంది గాలిస్తున్నారు.

పరారీలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు వారు కేంద్రానికి తిరిగి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. కరోనా వైరస్ కు గురైన వారిని క్వారంటైన్ చేసేందుకు గ్రామ పంచాయతీ దిండోలోని హాస్టల్‌ను కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇతర జిల్లాల నుంచి తిరిగి వచ్చిన 29 మంది వలసదారులను నిర్బంధ కాలం పూర్తి చేయడానికి ఉంచారు.

ఈ కేంద్రానికి కాపలాగా పోలీసు సిబ్బందితో పాటు కాపలాదారును కూడా ఏర్పాటుచేశారు. అయితే, పాజిటివ్ వచ్చిన 10 మంది వలసదారులను కరోనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ 19 మంది వలసదారులు నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వలసదారుడు కేంద్రం నుంచి తప్పించుకున్నాడు. మళ్లీ బుధవారం మరో 10 మంది వలసదారులు తప్పించుకున్నారు. పరారైన వారితో పోలీసులు, వైద్య సిబ్బంది సంప్రదింపులు జరుపుతున్నారు.

మీ ద్వారా మరికొందరికి కూడా కరోనా వైరస్ సోకుతుందని, త్వరగా వచ్చి మీతోటవారిని కాపాడాలని వారు పారిపోయిన వలసదారులకు సూచిస్తున్నారు. మొత్తం 11 మంది వలసదారులపై త్రికుండ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పరారైన ఐదుగురిని గుర్తించి తిరిగి క్వారంటైన్ కేంద్రానికి తీసుకురాగలిగారు. ప్రస్తుతం అక్కడ 10 మంది వలసదారులు నివసిస్తున్నారు. కేంద్రం వద్ద భద్రతా వ్యవస్థను బలోపేతం చేశారు.

Tags :
|

Advertisement