Advertisement

  • బుమ్రా నో బాల్ కారణంగా ఆ ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధించింది ..భువనేశ్వర్ కుమార్

బుమ్రా నో బాల్ కారణంగా ఆ ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధించింది ..భువనేశ్వర్ కుమార్

By: Sankar Sun, 28 June 2020 09:10 AM

బుమ్రా నో బాల్ కారణంగా ఆ ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధించింది ..భువనేశ్వర్ కుమార్



ఇండియా -పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగిన అది యొక్క యుద్ధ వాతావరనాన్ని తలపిస్తుంది ..ఆటగాళ్లు మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠతో చూస్తారు ..అయితే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మేజర్ ఐసీసీ టోర్నీ లలో ఎప్పుడు మ్యాచ్ జరిగిన ఎక్కువగా ఇండియానే గెలుస్తుంది ..ఇప్పటిదాకా ప్రపంచకప్ మ్యాచ్ లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఇండియా మీద గెలవలేదు ..అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ జట్టు ఇండియా మీద విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది ..అయితే ఆ మ్యాచ్ ముందు వరకు అత్యంత పటిష్టంగా ఉన్న టీమిండియా ఆ మ్యాచ్ల్లో మాత్రం పాకిస్తాన్ ముందు తేలిపోయింది..

అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా చేసిన కొన్ని తప్పిదాల వలన ఆ మ్యాచ్ లో ఓటమి చవిచూసింది..అందులో అత్యంత ముఖ్యమైనది బుమ్రా వేసిన నో బాల్ ..ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ.. రిప్లైలో ఆ బంతి నోబాల్ అని తేలడంతో.. జీవనదానం పొందిన ఫకార్ జమాన్ సెంచరీ బాదేశాడు. దాంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.

అయితే ఆ మ్యాచ్ లో ఓటమిపై భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.. బుమ్రా నోబాల్ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. ఆ ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిపోకుండా ఉండేందుకు చాలా పోరాడాం. కానీ.. దురదృష్టకరంగా.. ఓడిపోయాం. పాకిస్థాన్ క్రికెటర్ల తక్కు స్కోరుకే టీమిండియాని కట్టడి చేయగలిగారు. ఆ ఫైనల్ మ్యాచ్‌ ఓటమికి సరైన కారణం చెప్పడం కష్టం. కానీ.. బుమ్రా నోబాల్ మ్యాచ్‌లో కీలక మలుపు’’ అని భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు.

Tags :
|
|

Advertisement