Advertisement

  • అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు

అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు

By: chandrasekar Wed, 02 Sept 2020 10:10 PM

అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు


జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్ ఇవాళ తెల్ల‌వారుజామున మధుర జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా విద్వేషపూరిత ప్ర‌సంగం చేసిన‌ట్లు క‌ఫీల్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

క‌ఫీల్‌ను వెంట‌నే రిలీజ్ చేయాల‌ని అల‌హాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ త‌ర్వాత క‌ఫీల్ మీడియాతో మాట్లాడాడు. అద్భుత‌మైన తీర్పు ఇచ్చిన న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ధ‌న్యవాదాలు తెలుపుతున్న‌ట్లు క‌ఫీల్ తెలిపాడు. త‌న ప్ర‌సంగం విద్వేష‌పూరితంగా లేద‌ని కోర్టు స్ప‌ష్టంగా చెప్పింద‌న్నాడు. స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ద‌ళాలు త‌న‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల కూడా క‌ఫీల్ కృతజ్ఞతలు చెప్పాడు.

ముంబై నుంచి మ‌ధుర తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌ను టాస్క్ ఫోర్స్ ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేద‌న్నాడు. అలీఘ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీలో సీఏఏకు వ్య‌తిరేకంగా ప్ర‌సంగం చేసిన నేప‌థ్యంలో డాక్ట‌ర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. గోరఖ్‌పూర్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో 60 మంది చిన్నారుల మృతి కేసులో కూడా డాక్ట‌ర్ క‌ఫీల్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

Tags :
|

Advertisement