Advertisement

  • అయోధ్యలో వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు...నిఘా సంస్థల హెచ్చరిక

అయోధ్యలో వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు...నిఘా సంస్థల హెచ్చరిక

By: chandrasekar Wed, 29 July 2020 09:46 AM

అయోధ్యలో వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు...నిఘా సంస్థల హెచ్చరిక


భారతదేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని భారత గూఢచార సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయోధ్యలో శ్రీ రామ్ జన్మభూమి పూజ, అలాగే ఆగస్టు 15 సందర్భంగా దాడులు జరగవచ్చుఅని RAW చెబుతుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (RAW) ప్రకారం, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఈసారి ఆఫ్ఘనిస్తాన్‌లో జైష్, లష్కర్ ఉగ్రవాదులకు భారతదేశంలో శిక్షణ ఇచ్చి, వారిని మూడు నుంచి ఐదు గ్రూపులుగా భారత్‌కు పంపేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఇందులో జైష్ ఉగ్రవాద ఆత్మాహుతి దాడులకు పేరుగాంచింది.

ఆగస్టు 5న అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ రామ్ జన్మభూమికి పునాది వేయబోతున్నారు. 2019 సంవత్సరంలో ఇదే రోజున ఆర్టికల్ 370 ను కాశ్మీర్ నుండి తొలగించారు. దీంతో వేర్పాటు వాదులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ ఈ సందర్భంగా పెద్ద దాడి చేసే అవకాశం ఉన్నట్లు నిఘాసంస్థలు అంచనా వేస్తున్నాయి.

రామజన్మభూమి పునాది ఉత్సవం జరిగిన 10 రోజుల తరువాత, భారత స్వాతంత్య్ర దినోత్సవం కూడా ఉంది. దీంతో ఉగ్రవాద గ్రూపులు వేర్వేరు ప్రదేశాల్లో దాడులు చేసి, దేశంలో అంతర్గత భద్రతకు సవాలు విసరాలని పథకం రచిస్తోంది. అయితే ఈ దాడులను ఉగ్రవాదుల ద్వారా అమలు చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు ఉంటాయని సమాచారం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఢిల్లీ, అయోధ్య, కాశ్మీర్లలో అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు ఇప్పటికే ఆదేశించాయి.

Tags :

Advertisement