Advertisement

  • హైదరాబాద్‌లో మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు...

హైదరాబాద్‌లో మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు...

By: chandrasekar Wed, 18 Nov 2020 5:19 PM

హైదరాబాద్‌లో మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు...


హైదరాబాద్‌లో పలు ఏరియాల్లో వరద బాధితులు కొన్ని రోజులగా మీ సేవా కేంద్రాల ముందు క్యూలు కడుతున్నారు. వరద సాయం అప్లై చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే లైన్‌లలో వేచి ఉంటున్నారు. దీంతో గంటల తరబడి లైన్లో నిలబడలేక జనం కష్టపడుతున్నారు. బీపీ,షుగర్ పేషెంట్లు మైకం వచ్చి పడిపోతున్నారు . పలుచోట్ల వరద బాధితులు ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వనస్థలిపురం లోని మీ సేవ సెంటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో చాలా మంది మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వరద బాధితుల కోసం పదివేల రూపాయలు ప్రభుత్వం వారి వారి అకౌంట్ లో వేసేందుకు మీ సేవలో ఒక దరఖాస్తు ఫారం ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో పెద్ద ఎత్తున జనాలు మీ సేవ సెంటర్ల ముందు క్యూలు కడుతున్నారు.

వనస్థలిపురంలో మీసేవా సెంటర్ వద్దకు చేరుకున్న జనాలు ఒక్కసారిగా గేటు లోపలికి చోచ్ఛుకెళ్లారు. ఈ సంఘటనలు పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అటు జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రజలంతా మీ సేవలో అప్లికేషన్ తీసుకోవటం లేదని ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన ప్రకటించారు. అటు రామంతపూర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరద బాధితులు రామంతపూర్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 10 వేల ఆర్థిక సహాయం కోసం ఆందోళనకు దిగారు. అధికారులు నగదును తమ అకౌంట్లలోకి జమ చేయాలని కోరుతున్నారు.

Tags :

Advertisement