Advertisement

  • టెన్నిస్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2021 మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభం

టెన్నిస్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2021 మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభం

By: chandrasekar Fri, 04 Dec 2020 5:40 PM

టెన్నిస్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2021 మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభం


ఈ సారి కరోనా వల్ల ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2021 మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభంకానుంది. సీజన్‌లో మొదటి గ్రాండ్‌స్లామ్‌ ఫిబ్రవరి 8న మొదలవనుందని టోర్నమెంట్‌ డైరెక్టర్‌ క్రెయిగ్‌ టైలీ ఆటగాళ్లకు సమాచారం అందించారు. కరోనా కారణంగా జనవరి 15 నుంచి రెండు వారాల పాటు క్రీడాకారులందరూ క్వారంటైన్‌లో ఉండాలి. ప్రతి చోట క్వారంటైన్ నింబంధనలు అమలు చేస్తున్నారు.

కానీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే ప్లేయర్లందరి కోసం ప్రత్యేక షరతులతో విక్టోరియా ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. కొన్ని షరతులతో క్రీడాకారులు సాధన చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సాధారణంగా టోర్నమెంట్‌ మెల్‌బోర్న్‌ పార్క్‌ వేదికగా జనవరి మధ్య నుంచి ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ చరిత్రలో తొలిసారి టోర్నీ ఫిబ్రవరికి కరోనా వల్ల వాయిదా పడింది.

Tags :
|
|
|

Advertisement