Advertisement

టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ కు కరోనా ..

By: Sankar Mon, 22 June 2020 3:57 PM

టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ కు కరోనా ..



ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎవ్వరిని వదలడం లేదు దేశాధ్యక్షుల నుంచి , కార్పొరేటర్ల దాకా , సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల దాకా ఇలా అందరు కరోనా దెబ్బకు వణికిపోతున్నారు ..ఇప్పటివరకు క్రికెట్లో కరోనా కేసులు బయటపడగా ఇప్పుడు అది టెన్నిస్ కు పాకింది ..ప్రపంచ 19 వ రాంక్ ఆటగాడు దిమిత్రోవ్ కరోనా బారిన పడ్డట్లు ప్రకటించాడు ..దీనితో దిమిత్రోవ్ తో కలిసి ఇటీవల ఒక ఎక్సిబిషన్ మ్యాచ్ల్లో డబుల్స్ ఆడిన దిగ్గజ ఆటగాడు జకోవిచ్ కు కరోనా భయం పట్టుకుంది ..తనతో సాన్నిహిత్యం గా ఉన్నవాళ్లంతా కరోనా టెస్ట్లు చేయించుకోవాలని దిమిత్రోవ్ సూచించాడు ..

క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ‌ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో భాగంగా తనతో ఆడిన బల్గేరియా ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో జొకోవిచ్‌లో భయం రెట్టింపు అయ్యింది. గతవారం ఎగ్జిబిషన్‌ టోర్నమెంట్‌లో భాగంగా జొకోవిచ్‌- దిమిత్రోవ్‌లు కలిసి డబుల్స్‌ ఆడారు. ఆ తర్వాత సెకండ్‌ లెగ్‌లో మరో మ్యాచ్‌ ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.రెండో లెగ్‌లో శనివారం బోర్నా కారిక్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత దిమిత్రోవ్‌లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ మ్యాచ్‌ను దిమిత్రోవ్‌ కోల్పోయిన అనంతరం టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కాగా నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే కోలుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ థాంక్స్‌’అని ప్రపంచ 19వ ర్యాంకర్‌ దిమిత్రోవ్‌ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. దిమిత్రోవ్‌కు కరోనా అని తేలడంతో ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌-ఆండ్రీ రూబ్లెవ్‌లు తలపడాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


Tags :
|

Advertisement