Advertisement

  • వీధి వ్యాపారుల కోసం జిహెచ్ఎంసి విన్నూత్న పథకం..ఫోన్ చేస్తే పదివేల రూపాయల రుణం

వీధి వ్యాపారుల కోసం జిహెచ్ఎంసి విన్నూత్న పథకం..ఫోన్ చేస్తే పదివేల రూపాయల రుణం

By: Sankar Wed, 19 Aug 2020 11:10 AM

వీధి వ్యాపారుల కోసం జిహెచ్ఎంసి విన్నూత్న పథకం..ఫోన్ చేస్తే పదివేల రూపాయల రుణం


హైదరాబాద్ నగర పాలక సంస్థ మరొక విన్నూత్న ఆలోచనలతో ముందుకు వచ్చింది..వీధి వ్యాపారుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. మీరు వీధి వ్యాపారం చేస్తూ... ఆర్థ్ధికంగా సాయం కోసం ఎదురు చూస్తుంటే... వెంటనే జీహెచ్‌ఎంసీని సంప్రదించండి. నిర్ణీత పత్రాలు అందజేసి వీధి వ్యాపారులుగా కార్డు తీసుకోండి.. బ్యాంకు నుంచి రూ.10వేల రుణం కూడా పొందవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. ఇందుకోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశారు. సాయం కోరేవారు 040- 2111 1111లో సంప్రదించాలన్నారు.

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులకు సహకారమందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ పథకం ప్రకటించింది. పథకంలో భాగంగా సర్వే ద్వారా వీధి వ్యాపారులను గుర్తించి బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి రూ.10వేల రుణం ఇప్పిస్తున్నారు. గ్రేటర్‌లో జరుగుతోన్న సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 77,939 మంది వీధి వ్యాపారులను గుర్తించామని లోకేష్‌ కుమార్‌ తెలిపారు. త్వరలోనే అవసరం అయిన వారందరికీ రుణాలు అందజేస్తామన్నారు.

కాగా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాల వారు బాగా దెబ్బతిన్నారు.. వీధి వ్యాపారాలు చేసేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజూవారి సంపాదనతో బతికే చిరు వ్యాపారులు కరోనా కారణంగా పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తెంది. హైదరాబాద్‌లో అయితే ఇలా చిరు వ్యాపారాలు, వీధి వ్యాపారాలు చేసుకొని బతికి వారు వేల సంఖ్యలోనే ఉన్నారు..ఇలాంటి వారందరికీ ఈ పథకం గొప్ప ఊరట అని చెప్పవచు..

Tags :
|

Advertisement