Advertisement

  • భారీ వర్షాల వల్ల నష్టం పదివేల కోట్లు ..కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం

భారీ వర్షాల వల్ల నష్టం పదివేల కోట్లు ..కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం

By: Sankar Fri, 23 Oct 2020 11:54 AM

భారీ వర్షాల వల్ల నష్టం పదివేల కోట్లు ..కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం


ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని శాఖల వారీగా గణాం కాలను వివరించింది.

పంట నష్టం రూ.8,633 కోట్లు, రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ.567 కోట్లు నష్టం వాటిల్లిం దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వరద సహా యక చర్యలకు తక్షణంగా రూ.550 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. వరదల సమ యంలో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ సం యుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు సభ్యుల కేంద్ర బృందంతో గురువారం సోమేశ్‌కుమార్‌ బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. ఇరిగే షన్, మున్సిపల్‌ శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ ఎంసీ, వాటర్‌ బోర్డ్, వ్యవసాయం, ఇంధన, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధి కారులు ఈ భేటీలో వరద నష్టం, సహాయక చర్యల తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

గత 10 రోజులుగా రాష్ట్రంలో అత్యధిక వర్షాల వల్ల హైదరాబాద్, పరిసర జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. మూసీ నదికి వరద ముంపు ఏర్పడటంతో పాటు నగరంలో మూడు చెరువులకు గండిపడటం వలన నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు.

రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీగా నష్టం జరిగిందని, ఆ మేరకు ప్రాథమిక అంచనాను రూపొందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి ఆహార పొట్లాలను అందజే శామన్నారు. వరద ముంపునకు గురైన 15 సబ్‌స్టేషన్‌లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్టు చెప్పారు.

Tags :

Advertisement