Advertisement

  • తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా పాజిటీవ్

తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా పాజిటీవ్

By: chandrasekar Sat, 04 July 2020 11:55 AM

తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా పాజిటీవ్


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజా పరిస్థితులపై, తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో తీసుకుంటున్నచర్యలపై రేపు పాలకమండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు సమాచారం.

తిరుమలలో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ సమయంలో సిబ్బందికి కరోనా వ్యాపించడంతో తాజా పరిస్థితులపై, అలాగే భక్తుల ఆరోగ్య రక్షణపై టీటీడీ సమావేశంలో చర్చించనుంది.

అందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే రోజుకు 100 మంది ఉద్యోగుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. 24 గంటల్లోగా రిపోర్టు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చెయ్యనున్నారు.

Tags :
|

Advertisement