Advertisement

అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ దాడి

By: chandrasekar Tue, 01 Dec 2020 11:37 AM

అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ దాడి


గుడిలోని అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ దాడి చేశారు. కర్నూలు జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రతాప్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో ఈ దాడి సంఘటన చోటుచేసుకుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

భారీగా తరలి వచ్చిన భక్తులకు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఉచిత దర్శనం కల్పించాలని ఆలయ పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్ శర్మ, మురుగు ఫణి శర్మ కలసి క్లర్క్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై క్లర్క్ నాగరాజుకు, పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అనుచరులతో వచ్చి గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారులపై దాడి చేశారు. దీంతో అర్చకులు గాయాలు పాలయ్యారు.

ఇందుకోసం భక్తులను అనుమతించడం కోసం టికెట్ల విషయంపై మీకు సంబంధం లేదని, మీ పని మీరు చూసుకోవాలంటూ అర్చకులను అసభ్యంగా దూషించారు. అనంతరం చర్నాకోలాతో కొట్టినట్లు అర్చకుడు సుధాకరయ్య తెలిపారు. దీంతో గాయాలపాలైన పూజారులు ఆలయ ఈవో మోహన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే దాడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటన పట్ల భక్తులు దిగ్బ్రాంతికి గురైయ్యారు.

Tags :
|

Advertisement