Advertisement

  • తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ...

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ...

By: chandrasekar Tue, 15 Dec 2020 10:22 PM

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ...


దేశవ్యాప్తంగా ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా మార్చనున్నారు. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ అరూప్ కుమార్‌ గోస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా గోస్వామి ఉన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.

ఏపీ నూతన చీఫ్ జస్టిస్‌గా అరూప్ కుమార్‌ గోస్వామిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అస్సాంకు చెందిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961లో జన్మించారు. గువాహటి యూనివర్సిటీలో ఎకానామిక్స్ లో 1981లో పట్టభద్రులయ్యారు. 1985లో గువాహటిలో ప్రభుత్వ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు.

Tags :
|
|

Advertisement