Advertisement

  • కొత్త టీవీ కొనేవారు త్వరపడండి ..వచ్చే నెల నుంచి రేట్లు భారీగా పెరిగే అవకాశం

కొత్త టీవీ కొనేవారు త్వరపడండి ..వచ్చే నెల నుంచి రేట్లు భారీగా పెరిగే అవకాశం

By: Sankar Mon, 14 Sept 2020 6:19 PM

కొత్త టీవీ కొనేవారు త్వరపడండి ..వచ్చే నెల నుంచి రేట్లు భారీగా పెరిగే అవకాశం


కొత్త టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ నెలాఖరు వరకు కొనుకుంటే తక్కువ రేటులో టీవీ ఇంటికి వస్తుంది..ఎందుకంటే వచ్చే నెల నుంచి టివిల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది..కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కల్పించిన దిగుమతి సుంకం తగ్గింపు ప్రయోజనం ఈ నెలతో ముగిసిపోనుంది.

ఓపెన్ సెల్ ప్యానెల్స్‌పై 5 శాతం దిగుమతి సుంకం వచ్చే నెల నుంచి మళ్లీ అమలులోకి రానుంది. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న టెలివిజన్ పరిశ్రమపై ఈ అంశంపై మరింత ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫుల్లీ బిల్ట్ ప్యానెల్స్‌ ధరలు ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాల మినహాయింపు పొడిగింపునకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్లను పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి 5 శాతం రాయితీని కల్పిస్తోంది. అందుకే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కూడా మన దేశంలో తయారీని ప్రారంభిస్తోంది.

టెలివిజన్లపై సుంకం వర్తింపు అమలులోకి వస్తే.. ధరలు కచ్చితంగా పైకి కదలొచ్చు. సుంకం మళ్లీ అమలులోకి వస్తే టీవీ తయారీ కంపెనీలకు మరో దారి కూడా ఉండకపోవచ్చు. ధరలు పెంచక తప్పదు. ఇదే జరిగితే టీవీల ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పెరగొచ్చు.

Tags :
|

Advertisement