Advertisement

  • టెలిగ్రామ్ వినియోగదారులకు షాకిచ్చిన వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్

టెలిగ్రామ్ వినియోగదారులకు షాకిచ్చిన వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్

By: Sankar Thu, 24 Dec 2020 6:41 PM

టెలిగ్రామ్ వినియోగదారులకు షాకిచ్చిన వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్


ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ మెసేజ్ లు చేసుకోవడం కోసం ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్లలో టెలిగ్రామ్ ఒకటి...అయితే ఎంతో మంది టెలిగ్రామ్ వినియోగదారులు ఉచితంగానే దీని సేవలను పొందుతున్నారు. తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు.

వచ్చే ఏడాది నుండి టెలిగ్రామ్ లో రాబోయే కొన్ని ఫీచర్స్ వాడుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే అని తెలిపారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ కారణంగా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత డబ్బులు అవసరమని అన్నారు.

2013లో పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ టెలిగ్రామ్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మిలియన్ల యాక్టీవ్ యూజర్లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు...ప్రస్తుతం కంపెనీని విక్రయించే ఆలోచన లేదని, అందువల్ల నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని 36 ఏళ్ల దురోవ్ చెప్పారు.

Tags :
|

Advertisement