Advertisement

  • తెలంగాణ పదో తరగతి విద్యార్థుల గ్రేడ్ వివరాలను విడుదల చేసిన విద్యాశాఖ

తెలంగాణ పదో తరగతి విద్యార్థుల గ్రేడ్ వివరాలను విడుదల చేసిన విద్యాశాఖ

By: Sankar Mon, 22 June 2020 4:07 PM

తెలంగాణ పదో తరగతి విద్యార్థుల గ్రేడ్ వివరాలను విడుదల చేసిన విద్యాశాఖ



కరోనా కారణంగా ఎన్నడూ లేని విధంగా ఈ సారి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయిపోతున్నారు ..ఇటీవలే తెలంగాణ సర్కార్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని చూడగా , కేసులు ఎక్కువ వస్తున్న హైదరాబాద్ , రంగారెడ్డి లలో వాయిదా వేసి మిగిలిన జిల్లాలలో పరీక్షలు పెట్టుకొమ్మని హైకోర్టు తీర్పు ఇచ్చింది ..అయితే ఇలా రెండు సార్లు పరీక్షలు పెట్టడం సాధ్యం కాదు , అలా అని ఎక్కువ కాలం వాయిదా వేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేము అందుకే ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది ..

ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ప్రతిపదికన గ్రేడ్‌లను నిర్ణయించారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్‌ వివరాలను సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్‌ వివరాలను బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఆఫిసియల్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్‌ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్‌ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. పాస్‌మెమో వివరాల్లో ఎవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి తెలిపారు.


Tags :
|

Advertisement