Advertisement

  • నీట్‌ 2020 ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థినికి అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకు

నీట్‌ 2020 ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థినికి అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకు

By: chandrasekar Sat, 17 Oct 2020 09:59 AM

నీట్‌ 2020 ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థినికి అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకు


వైద్య చదువు ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ 2020 ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థినికి అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకు వచ్చింది. జాతీయ అర్హ‌త ప్ర‌వేశ ప‌రీక్ష‌ నీట్‌-2020 ఫ‌లితాల్లో తెలంగాణ యువ‌తి స‌త్తా చాటింది. శుక్ర‌వారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో హైద‌రాబాద్‌కు చెందిన తుమ్మ‌ల స్నితిక అఖిల భార‌త స్థాయిలో మూడవ ర్యాంకును సాధించింది. అమ్మాయిల కేట‌గిరిలో రెండ‌వ ర్యాంకు. 720 మార్కుల‌కు గాను 715 మార్కులు వ‌చ్చాయి.

అలాగే రాష్ట్రంలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనంత ప‌రాక్ర‌మ బి నూక‌ల 710 మార్కులు సాధించి ఆలిండియా 11వ ర్యాంకును ద‌క్కించుకున్నారు. రాష్ట్రానికి చెందిన ఏడుగురు విద్యార్థులు టాప్‌-50 ర్యాంకులో ఉన్నారు. వివ‌రాల ప్ర‌కారం రాష్ట్రం నుంచి 54,872 మంది అభ్య‌ర్థులు నీట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ప్రవేశ పరీక్షకు దరాఖాస్తు చేసుకున్న వీరిలో 50,392 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. కాగా దేశ‌వ్యాప్తంగా నీట్‌కు 15,97,435 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,66,945 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. జాతీయ‌స్థాయిలో ఒడిశా విద్యార్థి సోహెబ్ అఫ్తాబ్ ఆలిండియా టాప‌ర్‌గా నిలిచాడు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో సోహెబ్ అఫ్తాబ్ 99.99 శాతం మార్కుల‌ను సాధించాడు.

Tags :
|

Advertisement