Advertisement

  • తెలంగాణాలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల...

తెలంగాణాలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల...

By: Sankar Sat, 31 Oct 2020 09:01 AM

తెలంగాణాలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల...


నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి పేర్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది.

రెండు వారాల కింద జాతీయస్థాయిలో నీట్‌ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచింది. రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ముగ్గురు బాలికలు ఉండగా, మొదటి 50 స్థానాల్లో 29 మంది బాలురు ఉన్నారు. బాలికలు మాత్రం 21 మంది ఉన్నారు.

సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులు వెల్లడించిన అనంతరం దరఖాస్తులు ఆహావనించి, అందులో నుంచి తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఈసారి ఇప్పటికే నీట్‌ నిర్వహణలో జాప్యం వల్ల వేగంగా ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటన కూడా ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.

వచ్చే నెల 1న ఆన్‌లైన్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ మెడికల్‌ ప్రవేశాలకు ప్రకటన నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈసారి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టే అవకాశముంది. ఒకవేళ నేరుగా సరి్టఫికెట్లు పరిశీలించాల్సి వస్తే పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉండటంతో వచ్చే నెల 20న తొలి విడత మెడికల్‌ సీట్లు కేటాయించనున్నారు.

Tags :

Advertisement