Advertisement

  • కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళన చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళన చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక

By: chandrasekar Wed, 19 Aug 2020 4:12 PM

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళన చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక


కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లుపై ఆందోళన చేయనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ హెచ్చరిక చేసింది. విద్యుత్‌ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ హెచ్చరించింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ఆమోదించేందుకు కేంద్రం యోచిస్తున్నదని, ఇదే జరిగితే దేశవ్యాప్తంగా గల విద్యుత్‌ ఉద్యోగుల ఆగ్రహానికి గురికాకతప్పదని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా దీనిపై ఏకీకృతమై పోరాడుతామని తెలిపారు.

దేశంలో విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ సమితి (ఎన్సీసీవోఈఈఈ) పిలుపుమేరకు మంగళవారం మింట్‌ కంపౌండ్‌లో లంచ్‌ బ్రేక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీనివల్ల నినాదాలు వుద్రిత స్థితికి చేరవచ్చని ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ పీ రత్నాకర్‌రావు మాట్లాడుతూ తాము వ్యతిరేకిస్తున్నా ఒడిశాలో నెస్కో, వెస్కో, సౌత్కోల ప్రైవేటీకరణను ప్రారంభించారని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆగ్రహన్నీ వ్యక్తంచేశారు.

వివిధ నగరాలు ఒడిశా, నాగపూర్‌, ఔరంగాబాద్‌, జల్గావ్‌, గయా, భాగల్పూర్‌, ఆగ్రా, గ్రేటర్‌ నొయిడా, ఉజ్జయిని, గ్వాలియర్‌, సాగర్‌ తదితర నగరాల్లో అమలుచేసిన ప్రైవేటీకరణ, పట్టణ ప్రాంచైజీ మోడల్‌ ఘోరంగా విఫలమయ్యిందని, మళ్లీ ప్రైవేటీకరణకు పూనుకోవడం సరికాదని తెలిపారు.

Tags :

Advertisement