Advertisement

  • Breaking News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఫైనల్...?

Breaking News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఫైనల్...?

By: Anji Thu, 24 Dec 2020 5:26 PM

Breaking News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఫైనల్...?

తెలంగాణలోని తన ప్రధాన ప్రతిపక్ష హోదాని బీజేపీని మింగేస్తుండడంతో కంగారు పడుతుంది ఆ పార్టీ. అందుభాగంగా ఖాళీగా ఉన్న పీసీసీ పదవిని త్వరగా పూడ్చాలని చూస్తుంది కాంగ్రెస్ హై కమాండ్.

ఆ స్థానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాల‌న్న చ‌ర్చ‌ల త‌ర్వాత రేవంత్ రెడ్డికే పీసీసీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. తెరాస, బీజేపీ దూకుడిని అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి స‌రైన వ్య‌క్తి అని పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

పార్టీ శ్రేణుల మద్దతు కూడా ఆయనకే ఉందని వారి అభిప్రాయం. అయితే సీనియర్లను బుజ్జగించడం తలకు మించిన భారంగా మారుతుంది.

ఇందుకుగాను… పీసీసీ రేసులో ఉన్న మ‌రో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని గ్రెస్ అత్యున్న‌త నిర్ణ‌యాక మండ‌లి అయిన సీడ‌బ్ల్యూసీలోకి తీసుకోవ‌టంతో బుజ్జగించాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

పీసీసీగా రేవంత్ రెడ్డి, సీడ‌బ్ల్యూసీ మెంబ‌ర్ గా కోమ‌టిరెడ్డి పేర్ల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు.

ఆ విధంగా కోమటిరెడ్డి ని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన గా ఉన్నట్టు సమాచారం.

అయితే అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ కు వెంటనే జరగబోయే నాగార్జున సాగర్ ఉపఎన్నిక తోనే సవాలు ఎదురుకాబోతుంది. ఈ ఛాలెంజ్ ని ఆయన ఏ మేరకు ఎదురుకుంటారు అనేది చూడాలి.

Tags :

Advertisement